Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Telangana తెలంగాణలో రిచెస్ట్ MP అభ్యర్థుల లిస్ట్..!

తెలంగాణలో రిచెస్ట్ MP అభ్యర్థుల లిస్ట్..!

by Satya
List of richest MP candidates in Telangana

సార్వత్రిక ఎన్నికల(General Elections) సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్‌‌లలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. కాగా నామినేషన్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.5,785 కోట్ల ఆస్తులు కలిగివున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల ఆస్తి, ఆయన పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.

ఇది చదవండి: ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి..!

అదేవిధంగా రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాని అఫిడవిట్‌తో వెల్లడించారు. వారి వద్ద 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఇక చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి తన కుటుంబం పేరిట రూ.4,490 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్‌తో తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద రూ.1,178 కోట్లు ఆస్తులుండగా, భార్య సంగీత రెడ్డి పేరుతో రూ.3,203 కోట్లు ఉన్నాయి. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.17 కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద ప్రస్తుతం చేతిలో రూ.60 లక్షల క్యాష్, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • కొండా సురేఖకు బుజ్జగింపులు.
    తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
  • ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: