అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District)లో భారీగా అక్రమ మద్యం(Illegal Liquor) పట్టుబడింది. ఐ పోలవరం మండలం పశువులంక గ్రామంలో పోలీసు(Police)లు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రొయ్యల చెరువుల వద్ద 3,072 మద్యం బాటిళ్లు, NDPL అక్రమ మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టి వారికి పంచేందుకు అధికార పార్టీకి చెందిన సుంకర నాగబాబు తన రొయ్యల చెరువు వద్ద దాచి ఉంచినట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడిచేసి మద్యాన్ని పట్టుకుని స్వధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అనంతరం ఎస్ఐ భాను ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బులు తరలించినా, నిలువచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 151178