త్వరలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం…

State Social Welfare Minister Merugu Nagarjuna

Advertisements

&NewLine;<p>దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం&comma; 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు&period; ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు&period;<br>విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం&comma; 125 అడుగుల విగ్రహాలను ఈనెల 19న ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో నాగార్జున సమీక్షించారు&period; ఈ కార్యక్రమం కోసమే జనభాగీధారి పేరిట అన్ని ప్రాంతాల నుంచి జనసమీకరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు&period; దేశంలో మరెక్కడా లేనంత ఎత్తులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా స్మృతివనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే విగ్రహాలు&comma; చిత్రాలు&comma; ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు&period; స్వరాజ్ మైదానంలో రెండు దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులను తొలి దశలో రూ&period;268&period;46 కోట్లతోనూ&comma; మలి దశలో రూ&period;106&period;64 కోట్లతోనూ చేపట్టారన్నారు&period; సుమారుగా రూ&period;400 కోట్ల తో స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు&period; విగ్రహ నిర్మాణం ఇదివరకే పూర్తి కాగా దీనికి సంబంధించిన లైటింగ్&comma; పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని&comma; మినీ థియేటర్&comma; మ్యూజియం&comma; స్కై లైటింగ్&comma; ఫౌంటెన్లు&comma; విగ్రహం ముందు&comma; వెనుక భాగాల్లో ఉద్యానవనాలతో సుందరీకరణ&comma; భవనాలు&comma; ప్రహారీ గోడల నిర్మాణం&comma; లిఫ్టులు&comma; వెహికల్ పార్కింగ్&comma; ఫుడ్ కోర్ట్ తదితర ప్రధానమైన పనులన్నీ దాదాపుగా పూర్తయిపోయాయని తెలిపారు&period; సందర్శకులకు అంబేద్కర్ చరిత్ర పూర్తిగా అవగతం కావడంతో పాటుగా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేలా అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరుగుతోందని తెలిపారు&period; ఈనెల 19 న జరిగే అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళితులు&comma; దళిత సంఘాల నేతలతో పాటుగా అంబేద్కర్ భావ జాలాన్ని అభిమానించే వారందరూ హాజరు కావాలని నాగార్జున పిలుపునిచ్చారు&period; ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి అంచనాలకు మించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు&period; ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రీతిలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు&period; పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై&period; శ్రీలక్ష్మి ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్లను గురించి మంత్రికి వివరించారు&period; ప్రస్తుత నిర్ణీత కార్యక్రమాల్లో కొన్ని మార్పులను మంత్రి సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.