తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించామని అమిత్ షా వివరించారు.
Amit Shah : బీఆర్ఎస్ టైం అయిపోయింది… బీజేపీ సమయం వచ్చింది
72