శ్రీశైలం (Srisailam):
శ్రీశైలంలో మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం (Akkamahadevi Jayantotsavam) దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. జయంతోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకలు నిర్వహించారు ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించి, మహాగణపతి పూజ, మల్లికా గుండంలోని శుద్ధ జలాలతో, జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. విశేష పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణిగా ప్రసిద్ధి పొందిన అక్కమహాదేవి శ్రీమల్లికార్జునుడిపై సంస్కృత, కన్నడ భాషలలో ఎన్నో వచనాలు చెప్పింది. అందుకే కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు. దీనితో శ్రీశైలం దేవస్థానం ప్రతి సంవత్సరం అక్కమహాదేవి జయంతోత్సవం విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి