ఉమ్మడి ప్రకాశం జిల్లా(Prakasam District)లో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) వైసీపీ(YCP)కి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ చీరాల టికెట్ ను వైసీపీ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ కు కేటాయించింది. అటు, ఆయన గతంలో ఇన్చార్జిగా వ్యవహరించిన పర్చూరు నియోజకవర్గంలోనూ చుక్కెదురైంది. పర్చూరు వైసీపీ టికెట్ ను యెడం బాలాజీకి ఇచ్చారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురైన ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులతో చర్చించి వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9న ప్రజల సమక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు. కాగా, ఆమంచి కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఏసీబీ వలలో టంగుటూరు ఎస్సై…