ఏపీ(AP)లో హోరా హోరీగా సాగుతున్న సమరంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు పెద్ద ఊరట లభించింది. పవన్ కే కాదు మొత్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే బిగ్ రిలీఫ్(Big Relief) అని చెప్పొచ్చు. ఇంతకాలం సరైన గుర్తు లేక.. తాత్కాలికంగా ఉన్న గుర్తు గాలిలో వేలాడుతూ అయోమయంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టు ఆదేశాలు కాస్తంత కాదు భారీగానే రిలీఫ్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఊపిరులు ఊదిందని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి పర్మనెంట్ గుర్తు ఇంతవరకు లేదు. కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఈసీ గుర్తింపు ఉన్న పార్టీలకే పర్మనెంట్ గుర్తు కేటాయిస్తారు. జనసేన ఇప్పటి వరకు ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీయే తప్ప ఈసీ గుర్తించిన పార్టీ మాత్రం కాదు. అందుకే ఆ పార్టీ గుర్తు ప్రతి ఎన్నికల సమయంలోనూ వివాదాస్పదమవుతోంది. జనసైనికుల్లో భయాన్ని పెంచుతోంది.
ఇది చదవండి: అన్నమాచార్య విశ్వ విద్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం..
పవన్ కళ్యాణ్ లో లేని ఆందోళన రేకెత్తిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు గుర్తును ఇష్టపడుతున్నారు. దాన్నే నమ్ముకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గాజు గ్లాస్ గుర్తు తమకే కేటాయించాలని ఆయన ఈసీని అభ్యర్థించారు కూడా. అయితే, రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే కావడంతో పక్కా గుర్తు ఎలా ఇస్తారన్న వివాదం చెలరేగింది. దీనిపై పవన్ ప్రత్యర్థులు కొందరు ఈసీ ముందుకు వెళ్లారు. గాజు గ్లాస్ గుర్తు తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ దశలో కోర్టు తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పవన్ హమ్మయ్య అనుకున్నారు. గాజు గ్లాస్ గుర్తు కేవలం జనసేనకే ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.