బ్రిటన్ వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. జగన్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. విదేశీ పర్యటనకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతినివ్వాలని విజయసాయి కోరారు. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. జరిగిన విచారణ అనంతరం జగన్ పిటిషన్ పై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి