ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడుమాట్లాడుతూ.. నమ్మకంతో అతిపెద్ద బాధ్యత నీకు అప్పగించాం. సమర్ధంగా నిర్వహించాలి.
అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ తగు గౌరవం కల్పించాలి. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. జాతీయ అధ్యక్షునిగా పార్టీ పరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే నెల నుండి పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పున:ప్రారంభించాలి. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన కార్యకర్తల్ని నియమించి గౌరవించాలి. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికీ తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.