ఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి తీసుకువెళ్లి భోజనం పెట్టించారు. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు అండగా నిలబడటంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా బోరుగడ్డ అనిల్‌పై మరో రెండు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే మధ్యలో అనిల్‌కు ఓ రెస్టారెంట్లో భోజనం పెట్టారు. రిమాండ్ ఖైదీకి పోలీసులు రాచమర్యాదలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి…
- విజయవంతంగా ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటనఅమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో…
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంవయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ…
- ఏపీ ప్రజలకు … నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమయింది. దీపావళి రోజున ఈ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం లబ్దిదారులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి