అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన సమ్మె శుక్రవారం 11 రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడి టీచర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, నిర్మలమ్మ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో అంగన్వాడి టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతానని మాట ఇచ్చి మాట తప్పారని జగన్ సర్కార్ పై అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్తామని జగన్ సర్కార్ కు హెచ్చరించారు. రోడ్డుపై భిటాయించి ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం తీసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
Read Also..