తిరుపతి అభివృద్దే మా ఆశయంగా ముందుకు సాగుతామని, ప్రజాభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బార్ లే అవుట్ జంక్షన్ మీదుగా నూతనంగ నిర్మించిన భూపిరాట్టి రహదారిని ఆదివారం టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన జీయంగార్ స్వాముల చేతుల మీదుగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, ముద్రనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యుల వారి తల్లి గారైన భూపిరాట్టి పేరు మీదుగా ఈ నూతన రహదారికి పేరు పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్దికై పాటుపడుతున్న తామపై ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయమని, దేశంలోనే తిరుపతి ఖ్యాతిని మరింత విస్తరించేందుకు శ్రమిస్తునే వుంటామన్నారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ ఇరువురు మాట్లాడుతూ 116 లక్షలతో తిలక్ రోడ్డు నుండి తాతయ్యగుంట గంగమ్మ గుడి వైపుగా జబ్బార్ లే అవుట్ జంక్షన్ వరకు నిర్మించిన భూపిరాట్టి నూతన రహదారిని ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి ప్రజల సౌకర్యార్ధం మరిన్ని అభివృద్ది పనులు త్వరలో చేపట్టడం, ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజల అభివృద్దే ప్రధాన అజేండగా ముందుకు వెలుతున్నామని, అభివృద్దిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ది చెబుతారని, తమ కౌన్సిల్ మొత్తం నగరాభివృద్దికై నిరంతరం పాటుపడుతూనే వుంటుందన్నారు.
తిరుపతి అభివృద్దే మా ఆశయం – టీటీడీ చైర్మెన్
51
previous post