కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గానికి ఓ ప్రాధాన్యత ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గెలిచారు. రెండుసార్లు వైసిపి నేత, ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. దీంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత చేకూరింది. యనమల రామకృష్ణుడి వయసు మీరడంతో తన వారసురాలిగా తన కుమార్తె దివ్య ను రంగంలోకి దింపారు. ఆయనకు కుమారులు లేరు. దీంతో వారసత్వాన్ని కుమార్తె దివ్యకు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించారు. దివ్యను ఇంఛార్జి గా ప్రకటించారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది, రోడ్డున పడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరినీ కలిపారు. కృష్ణుడు కి మంచి భవిష్యత్తును ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా వ్యవహారం నడిచింది. ఒకటో తేదీ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా మరోసారి అన్నదమ్ముల వివాదాలు బయటపడ్డాయి. రోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది. అన్నదమ్ముల మధ్య ఇలా ఘర్షణ జరిగితే ఈ సీటు వైసిపి ఖాతాలోకి పోవడం ఖాయమని సీనియర్ కార్యకర్తలు వాబోతున్నారు. ఎలాంటి పదవులు లేవు, అన్నదమ్ములు, కుమార్తె వీరికే పదవులా, వీటికోసం కొట్టుకుంటారా, పార్టీని పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు.
Read Also..