187
మిచాంగ్ తుఫాన్ భీభత్సం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, జిల్లాలోని అన్నిచోట్లా రోడ్లు జలమయం, చాలా చోట్ల రాకపోకలు బంద్. మిచౌoగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది . తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుంబాధ, లిఖితపూడి, భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్లపై కప్పులపై పడ్డాయి. దీంతో చాలా గ్రామాలు లో అంధకారం అలుముకుంది. సాయంత్రం నుంచి వర్షం తీవ్రతం మరింత పెరిగింది. సముద్రంలో అలలుఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం విడలేదు.