మిచాంగ్ తుఫాన్ భీభత్సం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, జిల్లాలోని అన్నిచోట్లా రోడ్లు జలమయం, చాలా చోట్ల రాకపోకలు బంద్. మిచౌoగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది . తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుంబాధ, లిఖితపూడి, భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్లపై కప్పులపై పడ్డాయి. దీంతో చాలా గ్రామాలు లో అంధకారం అలుముకుంది. సాయంత్రం నుంచి వర్షం తీవ్రతం మరింత పెరిగింది. సముద్రంలో అలలుఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం విడలేదు.
Tag:
cyclone news today
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు. ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట పరిహారం ఇస్తానని కథలు చెప్పాడు. ప్రజలు తమ భాదను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారికి తెలియజేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఇంత వరకు ఒక్క పైసా కూడా తుఫాను బాధితులకు ఇవ్వలేదు.
ఇదేనా ప్రభుత్వం నిబద్దత అని ఎద్దేవా చేసారు.




Total views : 79530