కమీషన్ కోసం కాంట్రాక్టర్ ప్రత్యూష ను మున్సిపల్ చైర్మన్ దంపతులు వేధిస్తున్నారు. ఏ వర్క్ చేయాలన్నా మాకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే మున్సిపల్ చైర్మన్ దంపతుల పై కాంట్రాక్టర్ మోదుగు.ప్రత్యూష ఆరోపణ చేసింది. కమిషన్లు ఇవ్వక పోతే పనులు చేయొద్దు అంటూ కాంట్రాక్టర్ పై మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు బెదిరింపులు దిగుతున్నారు. నగర పంచాయతీ మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసిన పనుల నిమిత్తం పనులు చేయటానికి ముందుగానే లక్ష రూపాయలు తీసుకొని మరల 10 శాతం కమిషన్ కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు కాంట్రాక్టర్ ప్రత్యూష పై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. సదరు పనులపై చైర్పర్సన్ గారిని అడగగా నీ భర్త మున్సిపల్ ఉద్యోగి అంటూ నీవు పనులు చేయకూడదని మీకు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామని చైర్పర్సన్ దంపతులు పనులు నిలిపివేయాలని చెప్పారు. తన భర్త మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగీ కారణంగా మీరు పనులు చేయకూడదు అంటూ చైర్ పర్సన్ కమిషనర్ కు లేఖ రాసిన నేపథ్యంలో పెట్టుబడి పెట్టిన పనులను నిలిపి వేయాలని ఇలా చేస్తే నేను ఆర్థికంగా నష్టపోతానని ప్రత్యూష ఆవేదన చెందింది. నేడు తాసిల్దార్ కార్యాలయంలో భాగంగా స్పందన కార్యక్రమంలో ఆర్జి ఇచ్చి ఉన్నాము. తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కాంట్రాక్టర్ ప్రత్యూష గోడు వెళ్ళబోసుకున్నారు.
కాంట్రాక్టు కమీషన్ కోసం మున్సిపల్ చైర్మన్ దంపతుల వేధింపులు..
48
previous post