కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు:
హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారని జగన్ మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసి కనీసం సాగునీటిని కూడా అందించలేక పోయారని ఆరోపించారు.
వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం…
దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. కొండలు, గుట్టలు దాటుకుని, 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించిందన్నారు. చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే ఈరోజు మన ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసిందని జగన్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.