Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh ఎస్ కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ప్రారంభం…

ఎస్ కోటలో శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ప్రారంభం…

by Prakash
Anasuya Bhardwaj

ఎస్.కోట స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్ కోటలో సీని నటి అనసూయ భరద్వాజ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యూయలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. అయితే, బంగారు ధరలు ఈమధ్యన భారీగా పెరిగాయన్నారు. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ‌ఇంత పెద్ద జ్యూయలరీ షోరూమ్ ఓపెన్ చేయడం ఆనందదాయకం అన్నారు. ఈ చుట్టు పక్కల ప్రాంతీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019184
Total views : 90068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.