ఎస్.కోట స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్ కోటలో సీని నటి అనసూయ భరద్వాజ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యూయలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. అయితే, బంగారు ధరలు ఈమధ్యన భారీగా పెరిగాయన్నారు. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద జ్యూయలరీ షోరూమ్ ఓపెన్ చేయడం ఆనందదాయకం అన్నారు. ఈ చుట్టు పక్కల ప్రాంతీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
vijayanagaram district news
Jindal Land Dwellers :
ఎస్.కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసిన జిందాల్ భూ నిర్వాసితులు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భముగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినా కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మా ప్రాంత పెద్దలు, సర్పంచులు, ఎం.పి.టి.సిలు, జిల్లా అధికారులు, జిందాల్ ప్రతినిధులు అందరూ సమాలోచన చేసి మా భూముల్ని జిందాల్ కు అప్పగించడానికి అంగీకరించాము. కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి, నగదు మరియు షేర్లు మాకు ఇస్తామని మమ్మల్ని నమ్మించి, ఈరోజు అమాయకులైన గిరిజనులు, హరిజనులు మరియు ప్రజలను మోసంచేసే స్థితికి యాజమాన్యం వారు వచ్చారు.
మాలో మాకు విభేదాలు, అనుమానాలు కలిగే విధముగా, ఇదివరకే జారీ చేసిన షేర్ల మొత్తము అందించే విషయమునకు సంబంధించి ఆ గ్రామం వాళ్ళు సంతకాలు చేసారు అనీ ఈ గ్రామం వాళ్ళు సంతకాలు చేసారు. షేర్లకు బదులు నగదు మొత్తము ఇచ్చేయమని అన్నారు. మీరు కూడా సంతకాలు చేసేయండి, లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరి ఇదే విషయమై గతంలో ఎమ్మెల్సీ సమావేశమైనపుడు, జిందాల్ కంపెనీ నిర్మాణమునకు భూములు ఇచ్చిన నిర్వాసిత రైతులకు నగదుతో పాటు కొంతమొత్తం అనగా ఒక్కో ఎకరా జిరాయితీ భూమికి రూ.2,00,000/-లు, డి.పట్టా భూమికి రూ.2,00,500/- చొప్పున షేర్ల రూపేణా యాజమాన్యం వారు పరిహారం క్రింద ఇచ్చారని, షేర్లు ఇచ్చినపుడు ఉన్న విలున (ఒక్క షేరు విలువ రూ.10/-లు) ఈ 15 సంవత్సరములలో వడ్డీతో పాటు మొత్తం విలువ పెరిగిందని, సేకరించిన ప్రతి ఎకరం భూమికి పెరిగిన మొత్తము ప్రకారం కంపెనీలో భాగస్వాములుగా గుర్తించి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. కానీ ఇంతవరకు ఈ విషయం తేలకపోగా ఇప్పుడు షేర్లు జారీ చేసినపుడు ఉన్న విలువ ప్రకారం బలవంతముగా సంతకాలు చేయించుకుని యాజమాన్యం నగదు ఇవ్వజూపడం అన్యాయం అని అన్నారు.
కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూములలో జిందాల్ యాజమాన్యం ఆధ్వర్యంలో, అల్యూమినా కర్మాగారమునకు బదులు MSME పార్కు నిర్మాణమునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణముగా MSME పార్కు నిర్మాణం చేపట్టే ముందు అందులో ఏర్పాటు చేయబోయే కంపెనీల వివరములు ప్రజలకు తెలియజేస్తూ స్థానికముగా ప్రజాభిప్రాయం సేకరించి, పార్కులో ఏర్పాటు చేయబోయే కంపెనీల విషయమై విధివిధానాలను రైతులకు వివరించే విషయమై 45 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేయాలని జిందాల్ సి.ఇ.ఓ కనకారావు కోరుతూ, పత్రికాముఖముగా ప్రభుత్వ యంత్రాంగమును కూడా కోరడమైనది.
కానీ నేటివరకు ఎటువంటి చర్యలు చేపట్టనందుకు గాను, నిరసనగా రేపటినుండి జిందాల్ నిర్వాసితులు అందరూ నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలియజేసారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడిన శృంగవరపుకోట శాసనసభ్యులు.. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు తమ గోడును ఎమ్మెల్యే కి విన్నవించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న నేషనల్ హైవే కోసం దగ్గరలో వున్న చెరువు గట్టును సగం తొలగించివేయడంతో తుఫాను సమయంలో ఆ చెరువు క్రింద ఉన్న పొలాలు మొత్తం సుమారు 25 ఎకరాలు నీట మునిగిపోయాయి అని రైతులు మొరపెట్టుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతి ఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని చెప్పారు. అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క పంట నష్టానికి కారణమయిన నేషనల్ హైవేకి వ్యతిరేకంగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ స్థానిక రైతులు రోడ్ పై నిరసన తెలియజేశారు..
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో తుఫాన్ ప్రభావంతో 20 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కొత్తవలస మండల కేంద్రంలో చిన్ని పాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జోగయ్యపాలెం లో తుఫాన్ కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగింది. జాతీయ రహదారి పనులలో భాగంగా కాలువలు మూసివేయడం వలన ….వరద నీరు పంట పొలాలపైకి రావటంతో కోత కోసిన వరిపంట మొత్తం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి (45) గా గుర్తింపు.. పద్మభనాభం మండలం నుండి ఇటుకలు వ్యాను తీసుకొని గజపతినగరం వచ్చిన రామస్వామి… ఇటుకలు అన్ లోడ్ చేసిన అనంతరం మూడవ అంతస్థు పైకి ఎక్కడం తో సమీపంలో గల 11 కేవి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. ఉదయం టీ పెట్టుకుందామని గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగిందని సమాచారం. గాయాలు పడిన వారికి ప్రధమ చికిత్స చేసి విశాఖ కె.జి.హెచ్ కు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన వారు గాయ పడిన వారి వివరాలు తామరాపల్లి వెంకటలక్ష్మి 50 సం,, ప్రాణవి 7 సం,, కెల్లా మోహన్ 10 సం,, కెల్లా లాష్య 8 సం,, కెల్లా శ్రావణి 30 సం,, సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి.. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎల్.కోట గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన గ్యాస్ సిలిండర్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, వెంటనే బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు





Total views : 46189