శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం (Sri Kashi Visveshwara Swamy Temple):
మహాశివరాత్రి (Maha shivaratri) సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆలయ విశిష్టత అందర్నీ ఆకర్షిస్తోంది. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు అలనాటి శ్రీకృష్ణదేవరాయల రెండవ రాజధాని అయిన పెనుకొండలో నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్విత క్షేత్రంగా కొలవబడుతోంది. అప్పట్లో ప్రజలు కాశీకి వెళ్లలేని పరిస్థితిని గమనించిన విజయనగర రాజులు.. అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం వచ్చేంత విశిష్టతతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఆలయ విశిష్టత గురించి అర్చకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏవైనా దోషాలు ఉన్న గ్రహ పీడలు ఉన్నా.. ఈ ఆలయంలో పూజలు చేస్తే తొలగుతాయని భక్తుల విశ్వాసం అని చెప్పారు. ఈ ఆలయం గురించి వర్ణిస్తూ ఒక పాము నిత్యం ఆలయంలోకి వచ్చే విధంగా గర్భగుడిలో ఒక రంద్రం ఉందని చెప్పారు. ఇప్పటికీ ఆ విశిష్టమైన సర్పం గర్భగుడిలోకి వచ్చి వెళ్తుంటుందని వివరించారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బీసీమంత్రి చెల్లుబోయిన వేణు పై టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి