వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ (Minister Usha Sri Charan) అండతో స్థానిక వైసిపి నేతలు (YCP Leaders) భూ కబ్జాకు పాల్పడుతున్నారు. పెనుకొండ మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన భూ యజమాని మాజీ టిడిపి సర్పంచ్ దత్తాత్రేయ పోలీసులను ఆశ్రయించారు. మాజీ టిడిపి సర్పంచ్ కు పెనుకొండ మండలంలోని ఎర్రమంచి రెవెన్యూ భూమిలో సర్వే నంబరు 68లో 62.80 ఎకరాలు ఉంది. ఇందులో నలుగురు డైక్లాట్ హక్కుదారులున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వైసీపీ నేతలు పట్టించుకోకుండా మంత్రి ఉషశ్రీ చరణ్ అండతో భూమిని చదును చేసే పనులు చేపట్టారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో హక్కుదారులు ఒకరైన రవీంద్రరెడ్డి వర్గం అధికార పార్టీ నాయకుల అండతో 20 పొక్లెయిన్లతో (జెసిబి) భూమి చదును పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న టిడిపి మాజీ సర్పంచ్ దత్తాత్రేయ వర్గం సంఘటనా స్థలానికి చేరుకొని తక్షణం పనులు ఆపాలని అన్నారు. ఆపేదే లేదని నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అని తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ పైన ఎదురు దాడి చేశారు. కియా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ కు వేడుకుంటున్న దత్తాత్రేయ.
ఇది చదవండి: రెండు ప్రాణాలు తీసిన భూమి వివాదం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి