కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం :
జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఈనెల 26 నుండి మార్చి 7 వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం మార్చి 2 వ తేదీ శనివారం 6 వ రోజు విగ్నేశ్వర పూజ, పరిషత్ పంచ గవ్య ప్రాసన, గోపూజ, మహా వ్యాసము రుద్రాభిషేకము, బిల్వార్చన, కుంకుమార్చన, నవగ్రహ హోమం, వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు సునీత దంపతులు పీటలపై కూర్చుని భీమ శంకర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం విశ్వ విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురువర్యులు డాక్టర్ అమర్ అలీషా హాజరై మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్జీవ లింగాలకు అభిషేకం నిర్వహించారు. పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఒక భగవంతు సంకల్పంతో ఈ కోటి మహా రుద్రాభిషేకం నిర్వహించడం ప్రతిరోజ ఏదో ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతి నీ తీసుకొచ్చి ఆశీస్సులు అందించడం. భక్తి తత్వాలు వినిపించడం పీఠాధిపతులు ఆశీస్సులు అందించడం జరుగుతుందని ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేసిన జ్యోతుల నెహ్రూకి భగవత్ సంకల్పం తోడై మరెన్నో కార్యక్రమాలు చేయాలని భగవత్ సంకల్పం నెహ్రూ కుటుంబం పొందుతూ ఈ చుట్టు పక్క ప్రాంతాల భక్తులకు అందించడం ఓ గొప్ప మహోన్నత కార్యక్రమం అన్నారు. ఈ అద్భుతమైన ప్రదేశంలో అందరూ కూర్చుని భగవత్ సంకల్పాన్ని ఏకత్వంలో భిన్నత్వంగా నిర్వహించడం. మనందరం కూడా ఆ భగవాన్ సంకల్పం పొందుతూ అందరికీ కూడా అందాలని ఆశిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే సామాన్యమైన విషయం కాదని ఒక భగవత్ సంకల్పం ఉన్నప్పుడే ఇటువంటివి సాధ్యపడతాయని అన్నారు. గోకవరం కు చెందిన ఆధ్యాత్మిక భక్తుడు తోట సాయి శివతత్వం, రామ తత్వం గురించి భక్తులకు వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాదిగా భక్తులు వచ్చి స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటికి పంపడమే మన ధ్యేయం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి