చిరుతపులి (Leopard) :
శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో చిరుతపులి (Leopard) కలకలం రేపింది.. అర్థరాత్రి ఓ మత్స్యకారుడిపై చిరుతపులి దాడికి యత్నించింది.. దీంతో మత్స్యకారుడైనా లక్ష్మినారాయణ ఘట్టిగా కేకలు వేయడంతో అతని వదిలి అడవిలోకి పారిపోయింది.. బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు చీకట్లో వేనకనుంచి చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసి కాలును నోటితో పట్టుకోవడంతో భయాందోళనకు గురైన లక్ష్మినారాయణ గట్టిగా కేకలు వేశాడు.
ఇది చదవండి : రంజాన్ పండగ పూట వివాహిత బలవన్మరణం
చుట్టుప్రక్కల వారు గట్టిగా అరవడంతో చిరుతపులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది అయితే చిరుతపులి దాడిలో గాయపడిన లక్ష్మినారాయణను దగ్గరలోని సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించిగా.. డాక్టర్లు ప్రధమ చికిత్స నిర్వహించారు. కాలుకు భలమైన గాయాలయ్యాయని ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. గాయపడిన మత్స్యకారుడుని ప్రభుత్వ వైద్యశాలలో అటవీశాఖ అధికారులు పరామర్శించి రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అర్థరాత్రి మత్స్యకారుడిపై చిరుతపులి దాడి…