పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం(Koyalagudem)లో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి విజయభేరి(Varahi Vijayabheri Sabha) సభ నిర్వహించారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy) హయాంలో పోలవరం ముందుకు కదిలింది అంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని, వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు 110 ఎకరాలు ఇచ్చేసిందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 నాటికి పోలవరం 50 శాతం పూర్తయిందని, కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. పునరావాస ప్యాకేజి అమలు చేస్తామని గిరిజనుల సహా అందరినీ నమ్మించాడని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.