హాస్టల్ (Hostel) :
శిథిలావస్థకు చేరిన హాస్టల్ (Hostel) లో ప్రాంగణంలో మందు బాటిల్ల దర్శనం ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే అందుకు భిన్నంగా సంక్షేమ శాఖ అధికారులు పట్టిపట్టనట్టు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ లోని ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ లో జరుగుతుంది. ఈ హాస్టల్ భవన నిర్మాణం కొన్ని దశాబ్దాల కాలంగా నిర్మాణం కాగా ప్రస్తుతం భవనం శిథిలావస్థలో ఉంది. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన సాంఘిక సంక్షేమ అధికారులు హాస్టల్లో కనీసం గేటు కూడా లేకుండా, చుట్టూ ఉన్న ప్రహరీ పడిపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు సైతం చోటు ఉన్నదని, అలాగే హాస్టల్ లోపలికి సర్పాలు, విష జంతువులు రావడం కూడా జరుగుతుందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హాస్టల్లో వంటగది అద్వాన స్థితిలో, అపరిశుభ్రంగా ఉన్నదని, విద్యార్థుల బాత్రూమ్స్ టాయిలెట్స్ ను సైతం లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన వాడుకలో లేకపోవడం జరుగుతుందని, విద్యార్థుల నివసించే గదుల తలుపులకు కనీసం గొల్లాలు లేకుండా, కిటికీలు సైతం లేవని విద్యార్థులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే హాస్టల్ పరిసర ప్రాంతాలలో మద్యం తాగి పడేసిన బీరు సీసాలు, మందు బాటిల్స్, వాటర్ బాటిల్స్ లు పెద్ద సంఖ్యలో నిల్వచేసి గోడౌన్ గా ఎస్సీ హాస్టలను ఉపయోగిస్తున్నారు. ఈ విషయంపై హాస్టల్ వార్డెన్ ను అడుగగా నేను వచ్చి ఒక సంవత్సరం 6 నెలలు మాత్రమే అవుతుందని మిన్నకుండిపోయారు. హాస్టల్ ముందు షాపులు ఉండడంతో విద్యార్థులు నాన అవస్థలు పడుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి