శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సిఏం జగన్ పర్యటించనున్నారు. ఏళ్ల తరబడి కిడ్ని వ్యాదుల భారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల కోసం తలపెట్టిన రెండు కీలక ప్రోజేక్ట్ లు ప్రారంభానికి సిద్దమయ్యాయి. దీనిని సిఏం జగన్ 14 వ తేదిన ప్రారంభించనున్నారు. 14వ తేదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచిలి మండలం మఖరాంపురం గ్రామానికి రానున్నారు. అక్కడ జాతీయ రహదారి పక్కన నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు.
మఖరాంపురం గ్రామము నుండి హెలికాప్టర్ లో పలాస చేరుకోని కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని ప్రారంభించనున్నారు జగన్. ఏపీ సర్కార్ కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మందికి ఉపయోగపడేలా 74.24 కోట్లతో కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని నిర్మించింది. వీటితో పాటు APIIC ఆద్వర్యంలో అరవై ఏకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కు, ఆంద్రాయూనివర్శిటి అనుబంద విభాగానికి సిఏం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అక్కడ నుండి పలాసలో రోడ్ షో నిర్వహించి అనంతంరం పలాస రైల్వే గ్రౌండ్ లో నిర్వహించే భహిరంగ సభలో జగన్ పాల్గోనున్నారు.
Read Also…
Read Also…