మాజీ మంత్రి బొత్స పై విజయవాడలో ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతోపాటు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఏసీబీకిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇచ్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీచర్ల వద్ద నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ముడుపులు ముట్టాయని తెలిపారు. సుమారు 65 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలు చేశారని మండిపడ్డారు. 1600 నుంచి 2500 మంది టీచర్లు మంత్రి, పేషీ ఘనాపాటీలపై దాడికి సిద్ధంగా ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతమంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- విజయవంతంగా ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటనఅమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో…
- ఏపీ ప్రజలకు … నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమయింది. దీపావళి రోజున ఈ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం లబ్దిదారులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.