జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు.తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు జనసేన, టిడిపి నాయకులకు తో కలిసి గండేపల్లి మండలం యల్లమిల్లి అడ్డరోడ్డు వద్ద నుండి గండేపల్లి శివారు సింగరంపాలెం రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసిఅధ్వానంగా ఉన్న రోడ్లు పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నెహ్రూ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై టిడిపి జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారి ఇది కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గండేపల్లి మండలంలో నిర్వహించామని పెద్దాపురం మండలం గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉందని దీనిని వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ను ప్రమాదాల నుండి కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామని ఈ అసమర్ధ ఎమ్మెల్యే వల్లే ఈరోజు నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని ఎన్నికల ముందు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి నియోజకవర్గం లోని రోడ్లన్నీ గుంతలు ,గొయ్యలు పుట్చాలని కోరారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక మరమ్మతులు చేయవచ్చని అన్నారు. ప్రతి మంగళవారం నువ్వు తీసుకువచ్చే రిజర్వ్ బ్యాంక్ అప్పులో 1200 కోట్ల రూపాయల కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక రిపేర్లు పూర్తవుతాయని ఎన్నికల ముందు ఈ కార్యక్రమం తీసుకుని మీరు ఓట్లు కోసం రావాలని, ఎన్నికల ప్రచారం రావాలని డిమాండ్ చేసిన జ్యోతుల నెహ్రూ లేదంటే రేపు రాబోయే జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని అన్నారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ ని గుంతలప్రదేశ్ గా మార్చేశాడు- జ్యోతుల నెహ్రూ
58