కన్నతల్లిని భారంగా భావించింది ఓ కూతురు .. జాలి , దయ లేకుండా మతిస్థిమితం లేని తల్లిని ఓ వృద్ధాశ్రమం ముందు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తల్లిని ఆశ్రమం వారుకూడా లోపలికి రానివ్వలేదు . దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ వృద్ధురాలు రోడ్డుపైనే ఎదురుచూస్తూ ఉండిపోయింది.. ఈ ఘటన విజయవాడలో అందరిని మనసులను బాధకు లోను చేస్తుంది. తొమ్మిది నెలలు కని పెంచిన కన్న తల్లిని ఆ కూతురు భారంగా బావించింది. జాలి లేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది.
గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె.. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకుంది . మంచి చదువు చెప్పించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. తన అవసరాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కానీ, ఆ కూతురు తల్లిని వదిలించుకోవాలనుకుంది. అమ్మ పట్ల కఠినంగా వ్యవహరించింది. మతిస్థిమితం కొల్పోయిన తల్లిని కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్దాశ్రమంలో చేర్పించింది. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె , అల్లుడు ఇంటికి తీసుకువెళ్లారు. వృద్ధురాలిని ఆశ్రమం వారు మళ్లీ తీసుకురాకండి అని చెప్పడంతో అప్పటి నుంచి కూతురి ఇంటి వద్దే ఉంటోంది. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ, ఓ బైక్ పైన తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలికి రావివ్వలేదు.. ఏం జరుగుతుందో తెలియని ఆతల్లి ఆశ్రమం గేటు పట్టుకొని దీనంగా తన కూతురి రాకకోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి