ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ అన్నారు. ధర్మవరం పట్టణంలో మంగళవారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతులో డిఐజి, ఎస్పీ పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీ R N, అమ్మి రెడ్డి ఐపీఎస్ , శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ , వి ఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గౌతమ్ కుమార్, ధర్మవరం పట్టణంలోని పలు ప్రాంతాలలో, బిఎస్ఎఫ్ సాయుధ దళాలు, పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. బిఎస్ఎఫ్ అధికారులతో డీఐజీ ,ఎస్పీ ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించి, జిల్లా భౌగోళిక పరిస్థితులను వివరిస్తూ ఎన్నికల విధుల గురించి తెలియజేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజలలో భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు. సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పారాయణ అనుమానస్పదలో తిరుగుతుంటే వెంటనే అధికారులకు సమాచారం తెలియజేసి అదుపులోకి తీసుకోవాలని సూచించారు. మీకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డిఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్డిఎస్పి విజయ్ కుమార్, పర్యవేక్షణలో ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని, సిఐలు ఎస్సైలు ధర్మవరం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ డిగ్రీ కాలేజీ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ తదితర ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలతో కలసి పోలీసులు కవాతు నిర్వహించారు.