ఎన్నికల కోడ్ (Election Code) :
రాష్ట్రంలో గత నెల 16 నుంచి ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఈసీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు ఉన్నతాధికారులు ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది.
వెంకట్రామిరెడ్డి ఉద్యోగ రీత్యా పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్నిరోజుల కిందట వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినట్టు వెల్లడైంది.
ఇది చదవండి : నంద్యాలలో టీడీపీకీ భారీ షాక్ తగిలే అవకాశం..!
కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ… కడప జిల్లా కలెక్టర్ తో నివేదిక తెప్పించుకుంది. వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిది. ఈసీ ఆదేశాలతో వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి ఎక్కడికీ వెళ్లరాదని స్పష్టం చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఈసీ ఆగ్రహానికి వెంకట్రామిరెడ్డిపై వేటు…