“తెలంగాణ రక్షణ సేన కాదు… రాక్షస సేన” అంటూ కవితపై ఫైర్…

"తెలంగాణ రక్షణ సేన కాదు... రాక్షస సేన" అంటూ కవితపై ఫైర్

Advertisements

<p>మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది&period; గ్రామానికి విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి గ్రామస్తులు&comma; పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది&period; అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ&comma; ఆమె పార్టీని &&num;8220&semi;తెలంగాణ రక్షణ సేన కాదు&comma; తెలంగాణ రాక్షస సేన&&num;8221&semi;గా అభివర్ణించారు&period; తెలంగాణను దోచుకోవడానికే ఆ పార్టీ ఏర్పాటైందని ఆరోపించారు&period; తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి&comma; దోపిడీ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు&period; ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ప్రజల పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు&period; సొంత తండ్రిపైనే పోరాటం చేస్తున్న నేత&comma; రేపు ప్రజల కోసం ఏమి చేస్తారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.