81
జీడిమెట్ల పియస్ పరిధి చింతల్ లో ఓ ఇంట్లో ఖమ్మంకు చెందిన బ్రాహ్మణ కుటుంబం అక్క రాధ (45), అన్న( 40), చెల్లెలు (35) నివాసముంటున్నారు.
వీరికి ఎవ్వరికి పెళ్లి కాలేదు.. గత మూడురోజులు క్రితం రాధ అనారోగ్యంతో మృతిచెందింది. మతి స్థిమితం లేని అన్న చెల్లెలు అక్క మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండ, చనిపోయిన మహిళ శవంతోనే 3 రోజులుగా అదే ఇంట్లో సాధారణ జీవనం సాగించారు. దీంతో ఇంట్లో నుండి తీవ్ర దుర్వాసన రావడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..