ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు – అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnav

Advertisements

&NewLine;<p>వైజాగ్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు&period; దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి టీడీపీ ఎంపీ కె&period; రామ్మోహన్‌నాయుడు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు&period; దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారైంది&period; 106&period;89 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశారు&period; 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాం&period; భూసర్వే&comma; జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం&comma; రెసిడెన్షియల్ కాలనీ&comma; ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం&period; బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లవోలో 52&period;2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సిన ఉంది&period; ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి&comma; రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది అని అశ్వినీ వైష్టవ్ తెలిపారు&period; వైజాగ్ జంక్షన్-గోపాలపట్నం మధ్య 15&period;31 కిలోమీటర్ల మేర 159&period;47 కోట్ల రూపాయలతో 3&comma;4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్‌లో అనుమతులు మంజూరుచేసినట్టు రైల్వే మంత్రి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..