ఏపీ కొత్త మ్యాప్ విడుదల…

Advertisements

<p>ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రాష్ట్ర సరికొత్త మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ&period; గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం&comma; పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మొత్తం 28 జిల్లాలతో కూడిన మ్యాప్‌ను రూపొందించింది&period; పరిపాలన సౌలభ్యం&comma; ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం&comma; అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసింది&period; ముఖ్యంగా రాజధాని విషయంలో కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ&comma; అధికారిక మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా స్పష్టంగా పేర్కొన్నారు&period; రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చూపిస్తూ రూపొందించిన ఈ మ్యాప్&comma; రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా తెలియజేస్తుంది&period; ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పాలన మరింత వేగవంతం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.