పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ప్రమాదకరంగా వంతెన.

పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ప్రమాదకరంగా వంతెన

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద వంతెన విరిగి ప్రమాదకరంగా మారింది&period; బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు&period; సుమారు వంద సంవత్సరాలు కావస్తున్నా కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు&period; ఈ బ్రిడ్జి కింద 300 ఎకరాల ఆయకట్టుకు వెళ్లే రైతులకు ఇదే మార్గం&comma; కోలాలపల్లి గ్రామానికి వెళ్లాలన్నా అప్రోచ్ మార్గం ఇదే&period; ఏ క్షణాన్నైనా వంతెన కూలిపోయే ప్రమాదం ఉన్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు&period;ఈ వంతెన పై నుంచి అధికలోడుతో మట్టిటిప్పర్లు&comma; లారీలు యథేచ్ఛగా వెళుతున్నాయి&period;&period; వంతెన పొడవునా గ్రిల్ లేకపోవడంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయనీ&period;&period; అధికారులు కనీస మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; వంతెన కూలిపోతే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెన పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.