అమరావతికి కేంద్ర కేబినెట్ వరాలు జల్లు.

అమరావతికి కేంద్ర కేబినెట్ వరాలు జల్లు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది&period; సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది&period; రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను మరింత బలోపేతం చేయడంతో పాటు&comma; వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు&period;ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు&period; కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు&period;<br &sol;>&NewLine;సుమారు 1&comma;299 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కార్యాలయ సముదాయం ద్వారా &&num;8230&semi;అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేసే అవకాశం కలుగనుంది&period; పరిపాలనా సామర్థ్యం పెరగడమే కాకుండా&comma; శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతోంది&period;<br &sol;>&NewLine;ఇదే సమయంలో కేంద్ర ఉద్యోగుల కోసం సుమారు 1&comma;235 కోట్ల రూపాయల వ్యయంతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది&period; ఈ ప్రాజెక్టులో 1&comma;504 నివాస గృహాలు&comma; ఆధునిక సదుపాయాలతో కూడిన నివాస సముదాయం నిర్మించనున్నారు&period; కార్యాలయాలు&comma; నివాస సముదాయాల నిర్మాణంతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు&period;<br &sol;>&NewLine;రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ఈ ప్రాజెక్టులు గణనీయమైన ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు&period; ప్రపంచ స్థాయి పరిపాలనా మౌలిక సదుపాయాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి&period;&period; ఈ ఆమోదం నిదర్శనమని ఆయన అభినందించారు&period; మొత్తం మీద ₹2&comma;534 కోట్ల విలువైన ఈ రెండు ప్రాజెక్టులు అమరావతి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచనున్నాయనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.