ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.

ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Advertisements

<p>ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా&comma; ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి&comma; జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ ఉద్యమంలో సుమారు 12 వందల మంది ప్రాణత్యాగం చేశారని&comma; వారి బలిదానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు&period; ప్రజలు ప్రాణత్యాగాలు చేసేంత గొప్ప నేల అని&comma; అందుకే తనకు ఆ నేల పట్ల&comma; అక్కడి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు&period; ఒక లక్ష్యం కోసం ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటారా అనిపించిందని వ్యాఖ్యానించారు&period; గతంలో అమరవీరులకు నివాళులర్పించేందుకు తాను వెళ్లాలని భావించగా&comma; ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఈ సందర్భంగా ఆరోపించారు&period;<br &sol;>&NewLine;యువతను బలిచేసి కొందరు నాయకులు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారని ఆయన విమర్శించారు&period; తెలంగాణ ఉద్యమ అసలు ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు&period; పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..