విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన.

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన

Advertisements

<p>ముత్తాతల కాలం నుంచి మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు&period; ఆ భూమే ఇన్నాళ్లు వారికి కూడు పెట్టింది&period; వారి పిల్లల్ని చదివిస్తోంది&period; ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో నోట్లో మట్టి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని కదం తొక్కారు కర్షకులు&period; ప్రాణాలైనా ఇస్తాం గానీ&&num;8230&semi;&period; భూములను ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు&period; విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ సాక్షిగా గుండెలు బాదుకుంటూ రైతులు చేసిన నినాదాలు ఇవి&period;<&sol;p>&NewLine;<p>తమ జీవనాధారమైన భూమిని కాపాడుకునేందుకు అన్నదాతలు రోడ్డెక్కారు&period; విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి చెందిన కొండకిండాం&comma; రాచకిండాం&comma; కిండాం అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు బొండపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు&period; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం దాదాపు 175 ఎకరాల సాగు భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటమే ఈ నిరసనకి కారణమైంది&period; దశాబ్దాలుగా ఆయా భూములను సాగు చేసుకుంటూ&&num;8230&semi; పచ్చని పొలాల పైనే ఆధారపడి జీవిస్తున్న వందలాది రైతు కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి&period; పారిశ్రామికీకరణ పేరుతో పచ్చని పంట పొలాలను లాక్కోవాలని చూడటంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది&period; ఉపాధి కల్పిస్తామంటూ తమకు ఉన్న ఉపాధిని దెబ్బతీయడం ఏంటని రైతుల ప్రశ్న&period;<&sol;p>&NewLine;<p>ఆందోళన జరుగుతున్న సమయానికి బొండపల్లికి జిల్లా కలెక్టర్‌ రాగా&period; రైతులు&comma; నాయకులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు&period; భూసేకరణను తక్షణమే నిలిపివేసి&comma; తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు&period; ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లి భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే&comma; తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని&comma; ఏ త్యాగానికైనా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..