ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్

Advertisements

<p>ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది&period; ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది&period; ప్రభుత్వ వైద్య సేవల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది&period; ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య&comma; ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించారు&period; నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు తమ విధులకు హాజరుకావడం లేదని ప్రభుత్వం గుర్తించింది&period; దీనిపై వారికి పలుమార్లు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది&period; వారిపై అభియోగాలు కూడా నమోదు చేసినప్పటికీ&comma; వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు&period; దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు&period; గత నెలలో కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మందిని శాశ్వతంగా తొలగించారు&period; వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు&comma; అసిస్టెంట్ ప్రొఫెసర్లు&comma; ట్యూటర్లు ఉన్నారు&period; తాజా చర్యలతో పాటు మరో 34 మంది వైద్యులపై అభియోగాలు నమోదు చేసి నోటీసులు ఇవ్వగా&&num;8230&semi; వారు తమ పదవులకు రాజీనామా చేశారు&period; వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.