ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా

Advertisements

<p>నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ కావడంపై ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఎం&period; రమ్యశ్రీ హర్షం వ్యక్తం చేశారు&period; గ్రామీణ ప్రాంత బాలికలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని పేర్కొన్నారు&period; మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు&period; జూనియర్ కళాశాలలో ఎంసీపీసీ&comma; బైపీసీ గ్రూపుల్లో తలో 40 సీట్లు అందుబాటులోకి రానుండటంతో విద్యార్థినులు వైద్య&comma; ఇంజినీరింగ్&comma; సైన్స్ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు&period; ఇంటర్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన విద్యను పొందే అవకాశం కలగడం తల్లిదండ్రులకు కూడా ఊరటనిస్తుందని చెప్పారు&period; ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని&comma; గురుకుల విద్యాసంస్థ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రిన్సిపాల్ ఎం&period; రమ్యశ్రీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.