ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి

Advertisements

<p>రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు&period; ప్రతి సంఘటనకు కుల&comma; మత రంగు పులిమి&comma; వివాదాస్పదం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు&period; ప్రభుత్వ ఉద్యోగులు&comma; అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం&comma; తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు&period; సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు&period; విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న తప్పుడు ప్రచారాలను&comma; ఘటనలను అరికట్టేందుకు అధికారులు&comma; ఉద్యోగులు చొరవ చూపాలన్నారు&period; ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు మానసిక సమస్యలు&comma; మరికొన్నింటికి గంజాయి&comma; ఇతర మాదకద్రవ్యాల వ్యసనం కారణమని ఆయన విశ్లేషించారు&period; ప్రభుత్వం పాత కేసులను సైతం పరిష్కరిస్తోందని&comma; 2019లో జరిగిన నేరాలను ఇప్పుడు గుర్తించి నిందితులను పట్టుకుని శిక్షలు పడేలా చేస్తున్నామని తెలిపారు&period; తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరనే వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు&period; నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలన్నారు&period; రాష్ట్ర అభివృద్ధికి సాంకేతికత కీలకమని&comma; ఈ నేపథ్యంలో క్వాంటం ఆర్క్&comma; సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు&period; ఈ ఏడాది డిసెంబర్‌లో క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు&period; పచ్చదనం పెంపు&comma; పరిశుభ్రత&comma; జల భద్రత&comma; భూగర్భ జలాల రీఛార్జ్&comma; నదుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు&period; పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కింద వచ్చే అర్జీలను సానుభూతితో పరిశీలించాలన్నారు&period; సమస్య పరిష్కారం కోసం తమ దగ్గరకు వచ్చే పౌరులతో అధికారులు&comma; ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలి&period; వారి స్థానంలో మనమే ఉంటే ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి సేవలు అందించాలి&period; ఇది పరిపాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని ఆయన హితవు పలికారు&period; ఉద్యోగుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తామని&comma; పనితీరు ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తామని తేల్చిచెప్పారు&period; క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని&comma; మంత్రులు&comma; అధికారులు&comma; ఉద్యోగులు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు&period; సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఫైళ్ల క్లియరెన్స్ సులభమైందని&comma; అయితే వినూత్న ఆలోచనలు లేకపోతే వ్యవస్థలు నిస్సారంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు&period; ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్&comma; డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా&comma; వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.