ఏపీలో వేగవంతంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.

ఏపీలో వేగవంతంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ

Advertisements

<p>ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది&period; రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల పరిశీలన&comma; మ్యాపింగ్&comma; సవరణ పనులను ఎన్నికల అధికారులు ముమ్మరం చేశారు&period; రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తుండగా&comma; కొత్త ఓటర్ల నమోదు&comma; చిరునామా మార్పులు&comma; పేర్ల సవరణలు&comma; మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి&period; ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి&comma; ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంపై అధికారులు దృష్టి సారించారు&period; ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది కావడంతో&comma; ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం&comma; ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p>ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా&comma; వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు&period; శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల క్లస్టర్&comma; యూనిట్&comma; బూత్ ఇన్‌చార్జీలు&comma; బీఎల్ఏలతో మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ&period;&period; ఓటరుగా నమోదు కావడం ప్రతి పౌరుడి బాధ్యత&period;&period;అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపు ఇచ్చారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోలు&comma; బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు&period; 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని &period;&period;ప్రస్తుత ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సూచించారు&period; శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావడం సంతోషకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు&period; మ్యాపింగ్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం లేదా లోపాలు గమనిస్తే&&num;8230&semi; వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని ఓటర్లకు మంత్రి సూచించారు&period; పార్టీ ఆదేశాల మేరకు ప్రతీ బుధవారం బూత్&comma; క్లస్టర్ ఇన్‌చార్జీలు&comma; మండల నాయకులు తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు&period; ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న మంత్రి&period;&period;కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయాలు&comma; సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.