అరకులో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభం.

అరకులో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభం

Advertisements

<p>అరకు పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని అరకు ఎంపీ తనూజా రాణి ప్రారంభించారు&period; గతంలో అరకు పేరు చెప్పుకుని గెలిచిన కొందరు ఎంపీలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వచ్చాయని ఎంపీ తెలిపారు&period; అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలకు నేరుగా సేవలందించాలనే ఉద్దేశంతో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు&period; వారంలో మూడు రోజులు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని&comma; పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని సూచించారు&period;రాష్ట్రంలో వైసీపీ గతంతో పోలిస్తే మరింత బలపడిందని పేర్కొన్న ఎంపీ తనూజా రాణి&period;&period; ప్రతిపక్షాలు వైసీపీని లేకుండా చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు&period; కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులు&comma; చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు&period;జీవో నంబర్–3 అమలుపై లోక్‌సభలో తొమ్మిది సార్లు ప్రస్తావించినట్లు వెల్లడించిన ఆమె&period;&period; ఈ అంశంపై కేంద్ర మంత్రులు&comma; రాష్ట్రపతిని కూడా కలిసినట్లు తెలిపారు&period; హైడ్రో ప్రాజెక్టులు&comma; బాక్సైట్‌కు సంబంధించిన సర్వేలను ఖండించిన ఆమె&period;&period; గత వైసీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల రద్దుకు జీవో నంబర్–97 తీసుకొచ్చిందని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.