కృష్ణా జిల్లా ఆత్కూరులో నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన వెంకయ్య నాయుడు.

కృష్ణా జిల్లా ఆత్కూరులో నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన వెంకయ్య నాయుడు

Advertisements

<p>కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు&period; అనంతరం కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు&period; దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ&comma; రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు&period; రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు&period;ప్రజలకు అవసరమైన రహదారులు&comma; ప్రాథమిక పాఠశాలలు&comma; ఆరోగ్య కేంద్రాలు&comma; నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు&period; ఉచిత పథకాల కంటే మౌలిక వసతుల అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు&period;ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 800 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు&period; గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని&comma; ఆత్కూరు పీహెచ్‌సీ ద్వారా పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.