గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం..

గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం

Advertisements

<p>మండు వేసవి మొదలైతే చాలు… గోదావరి ఒడ్డున ఉన్న పల్లెల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం&comma; పినపాక&comma; మణుగూరు&comma; అశ్వాపురం మండలాల్లో మంచినీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది&period; ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రజలకు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; గ్రామాల్లో పైపులైన్లు పగిలిపోవడం&comma; రోజులు గడిచినా మరమ్మతులు చేయకపోవడం&comma; రెండు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరగడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది&period; ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది&period; మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక మహిళలు&comma; చిన్నారులు గంటల తరబడి బిందెలతో ఎదురు చూడాల్సి వస్తోంది&period; మరోవైపు అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; తలపైనే గోదావరి ప్రవహిస్తున్నా గొంతు తడవని గ్రామాల దుస్థితిపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం<&sol;p>&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు&period; అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అనేక మండలాలకు మంచినీరు అందించాలని ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందించింది&period; కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది&period; ఎక్కడికక్కడ పైపులైన్లు పగిలిపోవడం&comma; నీటి ఒత్తిడి తగ్గిపోవడం&comma; సరఫరా అంతరాయం కలగడం వల్ల గ్రామాల్లో ప్రజలు బోర్లు&comma; వ్యవసాయ బావులపై ఆధారపడాల్సి వస్తోంది&period; ఎండలు తీవ్రంగా ఉండటంతో భూగర్భజలాలు కూడా అడుగంటిపోతున్నాయి&period; దీంతో తాగునీటి కోసం మహిళలు&comma; వృద్ధులు&comma; చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; గ్రామాల్లో నీటి కోసం జనం క్యూలు కట్టడం సాధారణ దృశ్యంగా మారిపోయాయి&period; అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; వెంటనే పైపులైన్లు మరమ్మతు చేసి&comma; ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>గోదావరి నది పక్కనే నివసిస్తున్న ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నామని ప్రజలు వాపోతున్నారు &period; ఒకప్పుడు జీవనాధారంగా నిలిచిన గోదావరి జలాలు తగ్గిపోవడంతో పాటు మిషన్ భగీరథ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది&period; ముఖ్యంగా కరకగూడెం&comma; మణుగూరు&comma; అశ్వాపురం మండలాల్లో గ్రామాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది&period; గ్రామాల్లో రెండు మూడు రోజులకోసారి మాత్రమే నీరు రావడంతో ప్రజలు తాగునీటిని నిల్వ చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు&period; పైగా సరఫరా అయ్యే నీరు సరిపోక బావులు&comma; బోర్ల నుంచి నీరు తెచ్చుకుని వినియోగిస్తున్నారు&period; మరో వైపు సాధ్యమైనంత వరకు ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని మిషన్ భగీరథ ఏ ఈ తెలిపారు &period;<&sol;p>&NewLine;<p>అయితే కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; పగిలిపోయిన పైపులైన్లను వెంటనే మరమ్మతు చేసి&comma; ట్యాంకర్ల ద్వారా అత్యవసర నీటి సరఫరా చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు&period; ప్రజల దాహార్తి తీర్చడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలమవుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..