వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన

Advertisements

<p>రాష్ట్రంలో అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు&period; ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు&period; నెల్లూరు&comma; తిరుపతి&comma; కడప&comma; చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు&comma; సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు&period; ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయా జిల్లాల్లోనే బస చేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<p>జులై 1à°¨ తన పర్యటనను సంక్షేమ కార్యక్రమంతో ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి&period; &&num;8216&semi;పేదల సేవలో&&num;8217&semi; కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు&period; అనంతరం అదే రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకుంటారు&period; అక్కడ ప్రముఖ బైకుల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు&period; సుమారు రూ&period;750 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు&period; ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతిలోనే బస చేస్తారు&period;<&sol;p>&NewLine;<p>జులై 2à°¨ తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వీబీజీ రామ్‌జీను ప్రారంభిస్తారు&period; అదే రోజు సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగే జీఎస్‌డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌కు హాజరవుతారు&period; ఈ కీలక సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొననున్నారు&period; రెండో రోజు రాత్రి కూడా సీఎం తిరుపతిలోనే బస చేస్తారు&period;<br &sol;>&NewLine;పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా జులై 3à°¨ కడప జిల్లా పర్యటన ఉండనుంది&period; రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన స్టీల్ ప్లాంట్ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు&period; రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను లాంఛనంగా ప్రారంభించి&comma; ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనున్నారు&period;<&sol;p>&NewLine;<p>స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన అనంతరం&comma; చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు బయలుదేరి వెళతారు&period; జులై 3 నుంచి 5à°µ తేదీ వరకు మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి&comma; పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు చేస్తారు&period; నియోజకవర్గ ప్రజలతో మమేకమై&comma; స్థానిక సమస్యలను తెలుసుకుంటారు&period; మూడు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని జులై 5à°¨ తిరిగి అమరావతికి చేరుకుంటారు&period; ఈ ఐదు రోజుల పర్యటన ద్వారా ఒకేసారి సంక్షేమం&comma; పారిశ్రామిక అభివృద్ధి&comma; నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.