సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.

సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ

Advertisements

<p>రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా జ్యుడిషియల్ జిల్లాలను ఏర్పాటు చేసి&comma; అవసరమైన చోట నూతన కోర్టులను స్థాపించాలని ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది&period; అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది&period; పరిపాలనా జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరినట్లు ప్రతినిధులు తెలిపారు&period; జ్యుడిషియల్ అధికారుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు&period; అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని&comma; అధికారుల కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు&period; వీటితో పాటు సాఫ్ట్ లోన్ పరిమితిని పెంచాలని&comma; ఇంటి స్థలాలు కేటాయించాలని విన్నవించారు&period; అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు&period; జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు&comma; ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; ఈ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.