తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Advertisements

<p>దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు 125 రోజులు పని కల్పిస్తూ&period;&period; కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది&period; ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది&period; ఈ క్రమంలో ఏపీ వేదికగా ఈ సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు&period; కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ స్కీమ్ ను తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె గ్రామంలో సీఎం చంద్రబాబు&comma; ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్&comma; కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉమ్మడిగా ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p>సీఎం&comma; డిప్యూటీ సీఎం&comma; కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి మొక్కలు నాటారు&period; అనంతరం గ్రామీణ పారిశుద్ధ్యం&comma; నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలు&comma; మ్యాజిక్ డ్రైన్ల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు&period; జల సంరక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీ ని సందర్శించి&comma; వివరాలు అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>గ్రామీణ అభివృద్ధి&comma; ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చిన ఈ &OpenCurlyQuote;VB-G RAM-G’ పథకం వల్ల ఉపాధి హామీ కూలీలకు భారీ లబ్ధి చేకూరనుంది&period; ఈ పథకం కింద అర్హులైన కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ&period; 312 గా ఖరారు చేశారు&period; అంతేకాకుండా&comma; ఇప్పటివరకు ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; ఈ నిర్ణయం పట్ల ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో కలిసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.