జగ్గంపేటలో శిథిలావస్థలో జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా..

జగ్గంపేటలో శిథిలావస్థలో జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా

Advertisements

<p>జగ్గంపేట పట్టణంలోని జగ్గంపేట–గోకవరం ప్రధాన రోడ్డుపై ఉన్న జిల్లా పరిషత్ ట్రావెల్స్ బంగ్లా గత 12 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది&period; సుమారు 80 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ భవనం ఒకప్పుడు అధికారుల విశ్రాంతి కేంద్రంగా ఉపయోగపడేది&period; 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో తోట వెంకటాచలం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా&comma; జగ్గంపేటలో సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించడంతో విడిది కోసం ఈ బంగ్లాను జిల్లా పరిషత్ నిధులతో రూ&period;2 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు&period; అనంతరం ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత గెస్ట్ హౌస్‌లను ఏర్పాటు చేసుకోవడంతో ఈ భవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; ప్రస్తుతం ఈ స్థలం కబ్జాలకు గురయ్యే ప్రమాదం కూడా నెలకొంది&period; వెంటనే అధికారులు స్పందించి భవనాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మెట్టప్రాంత ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన ద్వారంగా పేరుగాంచిన జగ్గంపేటలో అధికారులకు సరైన విశ్రాంతి భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి&period; కాకినాడ నుంచి భద్రాచలం వెళ్లే అధికారులు&comma; రాజమండ్రి నుంచి విశాఖపట్నం ప్రయాణించే ప్రజాప్రతినిధులు&comma; అలాగే పోలవరం కాలువలు&comma; పుష్కర కెనాల్ పనులను పరిశీలించేందుకు వెళ్లే ఉన్నతాధికారులు ప్రతిరోజూ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు&period; అయితే ప్రభుత్వానికి చెందిన ఆర్&amp&semi;బీ గెస్ట్ హౌస్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది&period; మాజీ ఎమ్మెల్యేలు గానీ&comma; ప్రస్తుత ప్రజాప్రతినిధులు గానీ ఈ భవనం పునరుద్ధరణపై సరైన దృష్టి పెట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు&period; విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురికాకముందే తక్షణ చర్యలు తీసుకొని ఆధునిక సౌకర్యాలతో గెస్ట్ హౌస్‌ను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు&period; ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..

జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..

జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..